![]() |
![]() |
.webp)
సోషల్ మీడియాలో శుభశ్రీ రాయగురువు - అజయ్ మైసూర్ పెయిర్ గురించి చెప్పక్కర్లేదు. గ్రాండ్ గా ఒక్కటయ్యారు. లాస్ట్ ఇయర్ సోషల్ మీడియాలో వీళ్ళ ఆనందం, హడావిడి , ఆ పిక్స్, ఆ వీడియోస్ వేరే రేంజ్ లో ఉన్నాయి.ఐతే మరి ఏమయ్యిందో తెలీదు శుభశ్రీ రాయగురు ఇన్స్టాగ్రామ్ పేజీలో అజయ్ మైసూర్ ఫోటోస్ కానీ వీడియోస్ ఎక్కువగా కనిపించడం లేదు. కానీ అజయ్ మైసూర్ ఇన్స్టాగ్రామ్ పేజీలో నా బెటర్ హాఫ్ శుభశ్రీ అంటూ కనిపిస్తోంది.
ఇంతకు వీరి మధ్య ఎం జరిగిందో ఎవరికీ తెలీదు. శుభశ్రీ రీసెంట్ స్టేటస్ చూస్తే తెగ శాపనార్ధాలు పెడుతోంది. ఎవరికీ ఈ శాపనార్ధాలు తగలాలి పేరు మాత్రం రివీల్ చేయలేదు. "మీరు దేనికైనా సిద్ధంగా ఉంటారు కానీ మీకు అనుకూలంగా ఎదుటి వాళ్ళను సిద్ధంగా ఉంచలేరు. కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయం కోసం మీరు చాలాసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు." " ఎవరో వచ్చి మిమ్మల్ని స్పెషల్ పర్సన్ లా ట్రీట్ చేసి తర్వాత మధ్యలోనే మిమ్మల్ని వదిలేసినప్పుడు మీరు పట్టించుకోనట్టు నటించాల్సి రావడం నిజంగా నరకం " . " దేని గురించీ ఆలోచించనంతగా నీ జీవితం నాశనమైపోతుంది.
"నచ్చిన వాళ్ళు వదిలేసి వెళ్లిపోతుంటే చూస్తూ ఉండడం నిజంగా చాలా బాధాకరం" లాంటి స్టేటస్ లు పెట్టింది అలాగే ఒక పిక్ లో "ఎవరు చెప్పారు నేను జీవితాంతం నీతోనే ఉంటానని " అంటూ ఎవరో చెప్పినట్టు దానికి ఈమె బాధపడినట్టు పెట్టింది. అలాగే ఫైనల్ స్టేటస్ లో "నీ జీవితం నాశనమైపోతుంది" అంటూ కూడా గట్టిగా శపించింది. ఇంతకు ఆ శాపం ఎవరికీ తగలాలి కోరుకుంటుందో చెప్పలేదు. శుభశ్రీ - అజయ్ మైసూర్ మెజెస్టి ఇన్ లవ్ అనే కవర్ సాంగ్ ద్వారా కలిశారు. ఈమె తెలుగు బిగ్ బాస్ 7 ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది.
![]() |
![]() |